వెలుగు చూడని సర్సాల వ్యథ 

వెలుగు చూడని సర్సాల వ్యథ 

(మొదటి భాగం)

చాలా నిశబ్దంగా తెలంగాణలో గిరిజనులమీద , దళితుల ఉనికి మీద ప్రభుత్వం దాడిచేస్తూ ఉంది.

తెలంగాణ ప్రభుత్వం పాత అదిలాబాద్ జిల్లాలో గిరిజనుల, దళితుల భూములను లాక్కుంటూ ఉందో ‘ది లీడ్’ (The Lede) వాళ్ల మధ్య నిలబడి వెలికితీసింది. ఇది మూడు భాగాలుగా ప్రజలముందుకొస్తుంది.

మీరీ దారుణంగా, రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ, పోలీసలు, రెవిన్యూఅధికారుల రూపంలో పేద గిరిజనుల మీద దళితుల మీద దాడులు జరిగి, దశాబ్దాలుగా వాళ్లు సాగుచేసుకుంటూ ఉన్న భూములను లాక్కుంటూ ఉంది.

ప్రభుత్వం మే వీళ్లలో కొందరికి పట్టాదార్ పాస్ పుస్తకాలను, అటవీ హక్కు ప్రతాలను ఇచ్చిందన్న వాస్తవాన్ని తెలంగాణ ఏలినవారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

‘లక్ష్యాలు’ పూర్తి చేయడమే తమ పని అని అటవీ అధికారులు చెప్పడం ‘ది లీడ్’ గమనించింది. అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన అంకెల లక్ష్యాల (targets)ను పూర్తి చేసేందుకు పేద దళితుల, గరిజనుల బతుకులేమయినా పర్వాలేదనే బాధాకరమయిన నిర్లక్ష్యం జిల్లా అధికారులలో కనిపిస్తుంది.

సాధారణంగా ఈ దరిద్రులు ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల, భూ హక్కుల ఉల్లంఘన జరిగి,వాళ్లు గుర్తుపట్టలేనంతగా సర్వం కోల్నోయినపుడే వీళ్లు మన కళ్లకు కనిపించేది.

కొమరం భీమ్ జిల్లాలో కనిపిస్తున్నది విచ్చలవిడిగా సాగుతున్న ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వికృత రూపం. ఇది ఇంకా హింసాత్మకంగా మారకముందే నివారించవచ్చు.

భారతదేశంలో రైతులకు భూమికంటే బలమయిన మరొక భావోద్వేగ సొత్తు కనిపించదు. మరొక ఆదరువు లేని వాడి నుంచి ఆ కొద్ది భూమినీ లాక్కున్నపుడు ఆగ్రహం అంటుకుంటుంది. ఈ ప్రాంతాలల పర్యటించినపుడు ‘ది లీడ్’ కళ్లారా చూసిందిదే.

ఎందుకిదంతా జరుగుతూ ఉంది.ముఖ్యమంత్రికి ప్రతిష్టాకరమయిన కాళేశ్వరం ప్రాజక్టులో మునిగిపోయిన భూములకు నష్టపరిహారంగా మొక్కులు నాటాలి. అంటే ఒకచోటో చెట్లు నరికేసి మరొక చోట మొక్కలు నాటడం.

ఈ మూడు భాగాల కథనంలో తొలివిడత ది లీడ్ మిమ్మల్ని సర్సాల గ్రామానికి తీసుకువెళ్లుంది. ఇక్కడేం జరిగిందో కూడా గుర్తుపట్ట లేనంతా నిజాన్ని అధికార బలాఢ్యులు పూర్తిగా రూపుమాపారు.

ఇదీ దాడి

ఇక అధికారి మీద దాడి చేయడం దారుణమే.అందునా అధికారి మహిళ అయినపుడు అది మరీ అన్యాయం. ఇలా ఒక మహిళా అధికారి మీద జూన్ 30న దాడి జరిగింది.

కాగజ్ నగర్ డివిజన్ కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సి అనిత మీద కొంతమంది ఆరోజు కర్రలతో దాడి చేశారు. దాడిచేయవద్దని ఆమె ట్రాక్టరెక్కడి నిలబడ్డారు.

ఇదీ దానికి సంబంధించిన వీడియో

ఈ దాడి తర్వాత అనిత సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప తమ్మడు కోనేరు కృష్ణ తన కొట్టాడని కేసుపెట్టారు. కృష్ణతో పాటు మరొక 37 మంది గ్రామస్థులను ఐపిసి సెక్షన్లు 307( హత్యాయత్నం), 147 (మూకుమ్మడి దాడి), 148 (మారణాయుధాలతో దాడి), 322 (విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగిని గాయపర్చడం),353(ప్రభుత్వోద్యోగి మీద దాడి), 427 ( నష్టపరిచే తుంటరి చేష్టలు) 149 (అక్రమ సమావేశం) లతో పాటు మరొక 16 మంది గ్రామస్థుల మీద షెడ్యూల్డ్ కులాల,తెగల మీద దాడుల నిరోధ చట్టం లోని సెక్షన్ల 3 (2)(5) కింద కేసులు పెట్టారు.

తర్వాత ఆగస్టు 15 న అనితకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అవార్డు ఇచ్చారు.

అయితే, అందరి నోటా నానుతున్న ఈ కథ వెనక నలిగిపోయి మూలుగుతున్న అసలు నిజం వేరే ఉంది.

నిజానికి ఈ నిజం ఒక్క సర్సాలలోనే కాదు, పక్కునున్న ఆదిలాబాద్ జిల్లాటు ఇరుగుపొరుగు జిల్లాల్లో కూడా కనిపిస్తుంది.

సర్సాల వాస్తవం

సర్సాలలో ఏంజరిగిందో చెప్పలేక బుర్రం మల్లేశ్ గొంతు గద్గగమవుతుంది. కన్నీరాగదు.

జూన్ 30న అరెస్టయిన వారిలో బుర్రం మల్లేశ్ , ఆయన తండ్రి కూడా ఉన్నారు. ఈ వార్త రాయడానికి వారం ముందు మాత్రమే ఆయన్ని బెయిల్ మీద విడుదల చేశారు.

‘నా చదువు నాశనమయింది,’ అని మల్లేశ్ బాధపడ్తున్నారు. ‘ మాకున్నదంతా పోయింది. మా భూమి పోయింది, మా రాబడి పోయింది. హాస్టల్ లో ఉంటూ మంచిర్యాల్ జూనియర్ కాలేజీలో నేను ఇంటర్ సెకండియర్ చదువుతున్నా. అరెస్టయిన జైలు లో ఉన్నపుడు కాలేజీకి, హాస్టల్ కు వెళ్ల లేకపోయాను. దీనితో హాస్టల్ లో నారూం పోయింది. దీనికితోడు ప్రతి అదివారం నేను ఈస్గావ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలి. ఇపుడు కాలేజీకి వెళ్లలేని పరిస్థితి,’ మల్లేశ్ చెప్పాడు.

నేను కేసుల్లో ఇరక్కున్నానని, ఇంక ప్రభుత్వం ఉద్యోగం రాదని కొంతమంది భయపడిస్తున్నారు.

మల్లేశ్ అన్యాయం గురించి పదే పదే ప్రస్తావిస్తాడు. ఎలాంటి నోటీసు లేకుండా ప్రభుత్వ వాళ్ల భూములనే ఎందుకు లాక్కుందని మల్లేశ్ ప్రశ్నిస్తున్నాడు. ఈస్గావ్ పోలీస్ స్టేషన్ లో తన తండ్రి బుర్రం పోచంతో పాటు గ్రామస్థులందరిని ఎందుకు అంతగా కొట్టారనీ ప్రశ్నిస్తాడు. భూమి పోయి బతుకు బుగ్గిపాలయ్యాక కాలేజీ చదువెలాపూర్తి చేయాలని ఏడుస్తూ అడుగుతాడు.

‘ మాగొడు వినే వాళ్లవరున్నారు? మాకిలా చేయడం న్యాయమా? ప్రజలంతా అనితా మేడమ్ చెప్పిందే నమ్ముతారు. మరి మా సంగతేమిటి? మేం నిజం చెప్పాలనుకుంటున్నాం, ఎవరూ వినడం లేదు,’ అని మల్లేశ్ వాపోతాడు.

వాళ్ల అమ్మ బుర్రం వినోదా (40) కొడుకును వోదార్చలేకపోతున్నది. వినోదా బిసి యాదవకులస్థురాలు.

వినోదా ఖాయిలాతో బాధపడుతూ ఉంది. అక్కడేం జరుగుతున్నదో చెప్పేందుకు గ్రామస్థులు తీసిన వీడియోలింతవరకు బయటకు రాలేదు. వినోదా చెప్పిందెంత నిజమో ఈ వీడియోలు వివరిస్తాయి.

‘ఇక్కడ భూముల్లోనుంచి మమ్మల్ని తరిమేసేందుకు అనిత మేడమ్ ట్రాక్టర్ తో వచ్చినపుడు మాకడుపు కొట్టొద్దమ్మాని చేతులెత్తి నమస్కారం చేస్తూ వేడుకున్నాం. ఆమె కాళ్ల మీద పడ్డాం. ఆమె నన్ను బూటు కాలితో కొట్టింది,’ అని వినోదా చెప్పింది. తర్వాత చాలా మంది తన్నుకుంటూ పోయారు. నన్నుకొడుతూ ఉంటే అరుచుకుంటూ మిగతా గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను చచ్చానో బతికానో చూకుండా నా మొగుడు ఆమె దగ్గిరకు పరిగెత్తుకుంటూ వెళ్లి కొట్టాడు,’ అని ఆమె వివరించింది.

వినోదా అపుడు గర్భవతి. కొట్టిన దెబ్బలకు ఆమె కడుపు పోయింది. తర్వాత ఆమె భూములుపోయాయి. భర్త జైలుకెళ్లాడు. ఈపరిస్థితులను తట్టుకునేందుకు నరకయాతనపడుతూ ఉంది.

‘ నా వీపింకా నొప్పి చేస్తూ ఉంది. ఏ పని చేసుకోలేకుండా పోతున్నాను,’ వినోదా బాధపడుతుంది.

బుర్రమ్ కుటుంబం అయిదెకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉంది.

నేనీ ఇందిరా (65) అనే మహిళకు మూడెకరాలుంది. భూములు లాక్కోవద్దని ప్రాధేయపడుతున్న ఫారెస్టాఫీరు ఆమెనూ వదలకుండా కొట్టింది.

‘ ఆమె కాల్లుపట్టుకున్నాను. అయినా లెక్క చేయకుండా బూటు కాలుతో నా నొసట కొట్లింది. తర్వాత మిగతా వాళ్లు కూడా నన్ను ఛాతీ మీద కొట్టారు. మూడు రోజులపాటు ఈ దెబ్బల నుంచి కోలుకోలేకపోయాను,’ అని ఆమె చెప్పింది.

ఈ గొడవ దగ్గర ఉన్న వాళ్లు చెప్పేదానికి అధికారులు చెప్పేదానికి పొంతన లేదు. ఎమ్మెల్యే తమ్ముడు కోనేరు కృష్ణ ఫారెస్టాఫీసర్ అనితని కొట్టనేలేదని వాళ్లు చెబుతున్నారు.

‘ అనితా మేడమ్ అబద్దం చెప్పింది. మీడియా దాన్నంతా నిజంగా ప్రచారం చేస్తూ ఉందని బామిని నగేశ్ (22)చెబుతాడు. నగేశ్ కు రెండెకాల్లో సేద్యం చేస్తాడు. ‘ అంతేందెకు, మీరే వీడియో చూడండి, ఏంజరుగుతుందో తెలుస్తుంది,’ అని నగేశ్ చెబుతాడు.

‘ అసలు వీళ్ల పొలాల్లోకి చొరబడి ఎందుకు నాశనం చేస్తున్నారో చెప్పండయ్యా అని కృష్ణ గారు (ఎమ్మెల్యే తమ్ముడు) నిజానికి ట్రాక్టర్ మీద కొడుతున్నారు. ఆయన కర్ర ఎత్తి నపుడు అనిత మేడమ్ చేతులు బార్లా చాపిందిని ఆయన చెప్పాడు.

"అపుడు కర్ర ఆమె వేళ్లకు తగిలింది. కొద్దిగా గాయమయింది. నిజానికి ఆమెమీద వేటు వేసింది బుర్రం పోచం. అతనుకూడా ఎందుకు కొట్టాడంటే ఆయన భార్యను అనిత మేడమ్ బూటుకాలుతో కొట్టింది. ఫారెస్టోళ్లు, పోలీసులు కూడాకొట్టారు. ఈ అక్కసుతోనే ఆయన అనిత మేడమ్ ను కొట్టాడు,’ అని నగేశ్ చెప్పాడు.

అక్కడజరిగింది చూసినవాళ్లంతా ఇదే చెబుతారు.

‘ది లీడ్’ తో కోనేరు కృష్ణ మాట్లాడుతూ ఏమన్నారంటే, ‘ నేను జైల్లో పడినందుకు నాకేం బాధ లేదు. ఈ పేద గిరిజనులకు మంచి జరిగితే చాలు. రాజకీయాల్లో 20 యేళ్లుగా ఉంటున్నాను. ఏఒక్క అధికారి మీద జీవితంలో చేయెత్తలేదు,’అని ఆయన చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగ లేక ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడినుంచే ఫోన్ లో మాట్లాడారు.

నిజానికి అధికారులతో గౌరవంగా మాట్లాడండని, చెడ్డగా మాట్లాడవద్దనే తాను చెబుతున్నానన ఆయన చెప్పారు.

‘ పోచానికి ఎందుకు కోపం వచ్చింది? అతని భార్యను బాగా కొట్టారు. ఆ కోపంతో ఆయన దాడి చేశాడు. ఇక నా సంగతికొస్తే నన్నెంత ఇబ్బంది పెట్టినా నాకు బాధ లేదు. నేను ఈ గిరి జనుల కోసం నిలబడతాను,’ అని కృష్ణ చెప్పారు.

నిజానికి, సర్సాల గ్రామం మీద దాడి జరగడం ఇది మొదటి సారి కాదు. జూన్ 8న మూడు ట్రాక్టర్ల నిండా సిబ్బందినేసుకుని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఒక సారి దాడి జరిపారు.

అపుడు లక్కమ్ మల్లేష్ ని ఫారెస్టు వాళ్ల బాగా హింసించారు. ఇక తన భూమిని లాక్కుంటారని తెలిసి అతను ఒక చెట్టుకిందకూర్చుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. తర్వాత ఈ విషయం గ్రామస్థులకు తెలిసింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఇపుడాయన కోలుకుంటున్నాడు.

గిరిజన భూమి హక్కుల మీద దాడి

సర్సాలలో వీళ్లంతా మూడు నాలుగు దశబ్దాలుగా నివసిస్తున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006లో షెడ్యుల్డ్ తెగల జనాభా లెక్కల సేకరణ జరిగింది. తరాలుగా పోడు సేద్యం చేసుకుంటున్నవారికి అటవీ హక్కుపత్రాలిచ్చారు. తమాషా ఏమిటంటే ఈ పత్రాలిచ్చింది అటవీ శాఖ వారే.

జూన్ 2018లో కెసిఆర్ ప్రభుత్వం రైతు బంధు పతకం అమలుచేయడానికి ముందు పట్టాదార్ పాస్ పుస్తకాలిచ్చింది. సర్సాల లో చాలామంది రైతులకు సర్వే నెంబర్ 193 లోని భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి.

కాగజ్ నగర్ తాహశీల్దార్ కొమరంబీమ్ 2019 జూలై 5న ఆసిఫా బాద్ కలెక్టర్ కు ఇచ్చిన ఒక లేఖ ప్రకారం 2017-18 పహానీప్రకారం సర్వే నెంబర్ 193 లోని 272.21 ఎకరాలను కాగజ్ నగర్ మండల్ సర్సాల గ్రామానికి చెందిన 86 మంది రైతులకు అసైన్ చేశారు.

అయితే, ఇదే తాహశీల్దార్ పోలీస్ సబ్ డివిజినల్ ఆఫీసర్ కు లేఖ రాస్తూమరొక విధంగా ‘ కడంబలో ప్రచురించిన గెజిట్ జివొ ఎం ఎస్ నెంబర్ 916 (ఫారెస్టు డిపార్ట్ మెంటు తేదీ 15.07.1976) ప్రకారం సర్వే నెంబర్ పిపి ఎక్సెటెంట్ ప్రకారం 848 ఎకరాలు నోటిఫైడ్ ఫారెస్టు అని చెప్పారు.

రెవిన్యూ ల్యాండ్ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 193 లో ఉన్న మొత్తం 1850 ఎకరాలలో 848 ఎకరాలు ఫారెస్టుగా రిజర్వు చేశారు. మరొక 272 ఎకరాలను 86 మంది లబ్దిదారులకు కేటాయించారు. అయితే ఎక్కడ రెవిన్యూ భూమి సరిహద్దు ఉంది, ఎక్కడి నుంచి ఫారెస్టు భూములు మొదలవుతాయి అనేదే సమస్య. ఈ రెండు శాఖ లు ఈ భూభాగాలను విడగొట్టలేదు. కంచె వేసుకోలేదు.

ఈ క్లారిటీ లేకపోవడం వల్ల గిరిజనేలు దున్నుకుంటూన్న భూముల మీద దాడిచేసేందుకు ఆస్కారమిచ్చింది.

చాలా మంది సర్సాల గ్రామస్థులు తమకు ప్రభుత్వమే ఇచ్చిన హక్కు పత్రాలను కూడా ది లీడ్ కు చూపించారు.

బిసిలకు, షెడ్యూల్డ్ కులాలకు పట్టాభూము లున్నాయి.దానిని రుజువుచేసేందుకు పట్టాదార్ పాస్ పుస్తకాలు చూపిస్తున్నారు.

అయితే, కొంతమంది ప్రజలకు ఎలాంటి పత్రాలు లేవు. వాళ్లు కూడా దశాబ్దాలుగా భూములు సేద్యం చేసుకుంటున్నారు. అయినా, ఈ భూములను బలవంతంగా లాక్కోవచ్చని ఫారెస్టు అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. అందులో పంటవేసుకున్నా ధ్వంసంచేసి మెుక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా వేపచెట్టు, మునగచెట్లు నాటారు.

గ్రామస్థులు తమ హక్కు పత్రాలను చూపించి తమ భూములను లాక్కోవడం న్యాయంకాదని చెప్పే ప్రయత్నం చేశారు. అది పని చేయలేదు.

‘ నా పాస్ బుక్ ను చూపించాను అనిత మేడమ్ కు, అయితే దానిమీద తన సంతకం లేదని ఆమె దాన్ని చించిపడేసింది. కాలికిందేసి తొక్కేసింది,’ అని బిబ్బెర శ్యామల (35) చెబుతుంది. శ్యామల మూడెకరాల్లో వ్యవసాయంచేసుకుంటుంది.

మాకు కెసిఆర్ పర్మిషన్ ఇచ్చాడని అంబాల(21) స్వరూప చెబుతుంది. ఆమె కుటుంబానికి మూడెకరాలున్నాయ్.

‘ ఈ హక్కు ప్రతం ఎవరిచ్చారో వానికి పోయి చెప్పుకో పో,’ అని అనిత మేడమ్ తమని కొట్టి పత్రాన్ని చింపేసింది.

బతుకు దెరువు పోయింది

సర్సాల లోని గిరిజనుల, ఇతర కులాల వాళ్ల బతుకు అంధకారంలో పడిపోయింది. వాళ్లుంతా సాధారణంగా పత్తి పండిస్తుంటారు. అన్ని ఖర్చులు పోనూ ఏటా రు. 30 వేల నుంచి రు. 40 వేల దాకా రాబడి ఉంటుంది.

గత సంవత్సరం పంట పోయింది. పత్తి పంట మీద పెట్టుబడి దాదాపు రు. 50 వేలా దాకా వెళ్లింది. దీన్నంతా రాసే పల్లి కోఆపరేటివ్ బ్యాంక్ లో లోన్ గా తీసుకున్నారు. ఈ లోన్ ఇపుడు భారమయిపోతుంది. ఈ సంవత్సరం కూడదా కొంత లోన్ తీసుకున్నారు. మోకాలెత్తు పెరిగిన పంటని అటవీశాఖ వాళ్లు ధ్వంసం చేశారు. దీనితో దాదాపు ఒక లక్ష రుపాయల లోన్ మిగిలిందని, ఎలా తీర్చాలనే బెంగ అందరిలోకనిపిస్తుంది.

ఇపుడెలా బతకాలని నైని ఇంద్ర ప్రశ్నిస్తుంది. ‘ ఇపుడు నేనే పని చేయలేను. మామూలు పండిన పత్తి అమ్మి రుణం తీర్చేదాన్ని. ఇపుడు భూమి పోయింది. పంట చేతికిరాదు. నాకేమీ పశువుల్లేవు, ట్రాక్టర్లు వాడనీయరు,’ అని ఆమె వాపోతుంది.

అటవీ శాఖలో విపరీతంగా అవినీతి ఉందని గ్రామస్తులంతా వాపోతారు. ప్రతి సంవత్సరం జూన్ లో తలా ఎకరానికి నాలుగయిదు వేలు వసూలు చేసి ఫారెస్టు అధికార్లుకు సమర్పించుకుంటారని బామిని నగేశ్ చెబుతారు.

ఇలా లంచం ఇవ్వకపోతే, ఏవో కేసులు పెట్టి సతాయిస్తారు. పోయిలోకి కట్టెలు కూడా తెచ్చుకోనీయరని వారు చెబుతున్నారు.

కట్టెపుల్లయ్య (52) మూడెకరాల వ్యవసాయం చేస్తాడు. ‘ ఒకసారి రెండు బండ్లతో పోయికట్టెలు తెచ్చుకున్నాను. బండికి పదివేలు వసూలు చేశారు ఫారెస్టోళ్లు,’ అని ఆయన చెబుతారు.

వార్త రాసేటపుడు ఇపుడు పరిస్థతి ఏమిటి? మగవాళ్లంతా జైల్లో పడ్డారు. భూములను అధికారులు లాక్కున్నారు. మహిళలు గిరిజన హక్కుల కోసం ఏర్పాటు చేసిన ‘మన్నేరు వాలు సేవాసమితి’ పంచిన బత్తెంతో బతకుతున్నారు. ఈ సమితి సర్సాల గ్రామస్థులకు బియ్యం, ఉప్పు పప్పు , కూరగాయలు అందిస్తున్నది. మగవాళ్లంతా విడుదలయ్యే దాకా ఈ ఏర్పాటు కొనసాగుతుందని ఆశ.

రెండు రోజుల పాటు పోలీసోళ్లు,ఫారెస్టోళ్లు మమ్మల్ని పోలాల దరిదాపుల్లోకి కూడా రానీయలేదు,’ అని ఈ సమితి కొమరం భీమ్ జిల్లా అధ్యక్షుడు మేర్పల్లి బ్రహ్మయ్య చెబుతున్నాడు.

‘ అనిత మేడమ్ మమ్మల్ని కొట్టినా ఎలాంటి చర్య లేదు. మేం ఎస్ సి ఎస్ టి యాక్ట్ కింద కేసు పెట్టినా ప్రయోజనం లేదు,’ అని బ్రహ్మయ్య చెప్పాడు.

కాని, అదే తమ వాళ్లు కొట్టారో లేదో వెంటనే జైల్లో తోసేశారు. కొట్టడాన్ని తాను సమర్థించడంలేదు,అయితే, న్యాయంజరగాలనేకోరుతున్నా నని ఆయన చెప్పారు.

ఫారెస్టాఫీసర్ స్పందన

‘ది లీడ్’ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితని ఆమె కార్యాలయంలో కలిసింది. ఆమె చాలా గౌరవంగా మాట్లాడారు. ఏం జరిగిందో కూడా ఆమె వివరించారు.

‘కాలేశ్వరం ప్రాజక్టు కింద కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కోసం ప్రతిజిల్లాలో మాకు లక్ష్యం నిర్దేశించారు. దీనికోసం డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కుడుందో చూసి మొక్కలు నాటుతాం. మా డివిజన్ కు 220 హెక్టేర్ల ఎఫారెస్టేషన్ లక్ష్యం ఇచ్చారు. కాగజ్ నగర్ లో 40 హెక్టేర్లలో , సర్సాలలో 20 హెక్టేరల్లో మొక్కలు నాటాలని హెడ్డాఫీస్ వాళ్లు చెప్పారు,’ అని అనిత వివరించారు.

అనితయే అక్కడ దౌర్జన్యం మొదలుపెట్టిందని గ్రామస్థులు చెబుతున్న విషయాన్ని ఆమె దృష్టికి తెచ్చినపుడు అది పూర్తిగా తప్పని ఆమె చెప్పారు.

‘మేం వెనక్కి తీసుకున్న భూమంతా అక్రమంగా ఆక్రమించుకుని సాగుచేసుకుంటున్న ఫారెస్టు భూమియే. సర్సాల విషయానికొస్తే ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలన్నీ బిసిలవి, వాళ్లు గొలల్లు.,’ అని అనిత చెప్పారు.

‘ఇందులో కూడా ఒకరిద్దరు మాత్రమే పదేళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్తంతా మెల్లిమెల్లిగాఫారెస్టు భూముల్లోకి జరిగి సేద్యంచేసుకోవడం మొదలుపెట్టారు. ప్రతిసంవత్సరం కొంతదూరం ఫారెస్టు భూముల్లోకి జరుగుతున్నారు.మేం పట్టా భూములను, హక్కు పత్రం ఉన్న భూములను గాని ముట్టుకోనేలేదు, ’అని ఆమె చెప్పారు.

ఎమ్మెల్యే తమ్ముడు కోనేరు కృష్ణ తనని కొట్టాడా అని అడిగినపుడు ఎడమ చేతి మీద కొట్టాడని ఆమె చెప్పారు.

‘పోచం మహిళలను తన మీదకు వుసికొల్పాడు. నేనెవరినీ తిట్టలేదు, కొట్టలేదు. నేనేదయినా చెబితే దాన్ని అధికార అహంకారం అంటారు. నేను చెప్పిందంతా ఒక్కటే, నా మీదెవరైరా వేటు వేశారో, ఏమవుతుందో మీరే చూస్తారు. మేం మా విధులు నిర్వర్తిస్తున్నాం అని మాత్రమే చెప్పాను,’ అని అనిత చెప్పారు.

‘ సర్సాల కు వెళ్ల ముందు జిల్లా ఎస్ పికి సమాచారం అందించాం. ఎందుకంటే, ఇంతకు ముందు వెళ్తు ఒక మనిషి విషయం తీసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు.అక్కడ 20- 30 సాయుధ జవాన్లు కూడ ఉన్నారు. అక్కడి వెళ్లి మూడు ట్రాక్టర్లతో దున్నడం మొదలుపెట్టామో లేదో పది నిమిషాల్లో ఆడవాళ్లంతా వచ్చారుు. నేను ఒక్కతిరే ఉన్నాను అందువల్ల ట్రాక్టర్ ఎక్కి నిలబడ్డాను. కోనేరు కృష్ణ తోపాటు మిగతా అందరి దగ్గిర కర్రలున్నాయి. నాకు తలమీద దెబ్బ తగిలింది. కళ్లుతిరుగుతున్నాయి. రక్తం కారుతూ ఉంది. గ్రామస్థులంకు నన్నుకొట్టేంత ధైర్యం ఎలా వస్తుంది. కృష్ణయే ఎంకరేజ్ చేశాడు,’ అని అనిత చెప్పింది.

ఇక్కడ ఉండే గూడేలు ఎపుడొచ్చాయే చెప్పేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంటుదగ్గిర శటిలైట్ ఫోటోలున్నాయని అనిత చెప్పింది. వీటిద్వారా ఎవరు పదేళ్లుగా, అయిదేళ్లుగా, రెండేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారనేది తెలుస్తుందని, తాము కేవలం ఇటీవల అక్రమించుకున్నవారి మీదకే వెళుతున్నామని ఆమెచెప్పారు. ఫోటోలు చూపమన్నపుడు ఆఫోటోలు పై అధికారుల దగ్గిర ఉన్నాయని ఆమె చెప్పారు.

‘ప్రజలేమంటారు,మేం పేదవాళ్లం, మమ్మల్ని వ్యవసాయం చేసుకోనిమ్మని అడుగుతారు. కాని ఫారెస్టు ఉండేది పేదరిక నిర్మూలన కోసం కాదుగా. ఫారెస్టు భూములను పేదరిక నిర్మూలనకోసం వాడేందుకు వీళ్లేదు,’ అని ఆమె వాదిస్తారు.

ఫారెస్టు వాళ్లు గిరిజనుల భూముల లాక్కోవడం వాళ్లు భూముకోసం గొడవ చేయడం.. ఇదంతా గిరిజనుల హక్కల కోసం పోరాడిన కొమరం భీమ్ పేరుతో ఉన్న కొమరంభీమ్ జిల్లాలో జరగుతూ ఉండటమే విచిత్రం.

నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీమ్ గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. ఆయన్ని పట్టుకుని చంపేశారు. అయితే, ఇక్కడి జనపదాల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారు. ఇపుడే ముఖ్యమంత్రి కెసిఆర్ నిజాం జాగాలా కూర్చున్నారా అనిపిస్తుంది.

No stories found.
The Lede
www.thelede.in