గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)
Governance

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే (రెండో భాగం)

మొదటి భాగంలో సర్సాల గ్రామంలో ఏం జరిగిందో ‘ది లీడ్’ ఒక ప్రత్యక్ష కథనంలో వివరించింది. ఇలాంటి దాడలే ఆదిలాబాద్ జిల్లా అంతటా జరగుతున్నాయి.

Sandhya Ravishankar

Sandhya Ravishankar

చాలా నిశబ్దంగా తెలంగాణలో గిరిజనులమీద , దళితుల ఉనికి మీద ప్రభుత్వం దాడిచేస్తూ ఉంది.

తెలంగాణ ప్రభుత్వం పాత అదిలాబాద్ జిల్లాలో గిరిజనుల, దళితుల భూములను లాక్కుంటూ ఉందో ‘ది లీడ్’ (The Lede) వాళ్ల మధ్య నిలబడి వెలికితీసింది. ఇది మూడు భాగాలుగా ప్రజలముందుకొస్తుంది.

మీరీ దారుణంగా, రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ, పోలీసులు, రెవిన్యూ అధికారుల రూపంలో పేద గిరిజనుల మీద దళితుల మీద దాడులు జరిపి, దశాబ్దాలుగా వాళ్లు సాగుచేసుకుంటూ ఉన్న భూములను లాక్కుంటూ ఉంది.

ప్రభుత్వమే వీళ్లలో కొందరికి పట్టాదార్ పాస్ పుస్తకాలను, అటవీ హక్కు ప్రతాలను ఇచ్చిందన్న వాస్తవాన్ని కూడా తెలంగాణ ఏలినవారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

‘లక్ష్యాలు’ పూర్తి చేయడమే తమ పని అని అటవీ అధికారులు చెప్పడం ‘ది లీడ్’ గమనించింది. ప్రభుత్వం నిర్దేశించిన అంకెల లక్ష్యాల (targets)ను పూర్తి చేసేందుకు పేద దళితుల, గరిజనుల బతుకులేమయినా పర్వాలేదనే బాధాకరమయిన నిర్లక్ష్యం జిల్లా అధికారులలో కనిపిస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల, భూ హక్కుల ఉల్లంఘన జరిగి, గుర్తుపట్టలేనంతగా సర్వం కోల్నోయినపుడే ఈ దరిద్రులు మన కళ్లకు కనిపించేది.

కొమరం భీమ్ జిల్లాలో కనిపిస్తున్నది విచ్చలవిడిగా సాగుతున్న ప్రభుత్వ అణచివేత, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వికృత రూపం. ఇది ఇంకా హింసాత్మకంగా మారకముందే నివారించవచ్చు.

భారతదేశంలో రైతులకు భూమి కంటే బలమయిన మరొక భావోద్వేగ సొత్తు కనిపించదు. మరొక ఆదరువు లేని వాడి నుంచి ఆ కొద్ది భూమినీ లాక్కున్నపుడు ఆగ్రహం అంటుకుంటుంది. ఈ ప్రాంతాలల పర్యటించినపుడు ‘ది లీడ్’ కళ్లారా చూసిందిదే.

ఎందుకిదంతా జరుగుతూ ఉంది? ముఖ్యమంత్రికి ప్రతిష్టాకరమయిన కాళేశ్వరం ప్రాజక్టులో మునిగిపోయిన భూములకు నష్టపరిహారంగా మొక్కలు నాటాలి. అంటే ఒకచోట చెట్లు నరికేసి మరొక చోట మొక్కలు నాటడం.

ఈ మూడు భాగాల కథనంలో తొలివిడత ది లీడ్ మిమ్మల్ని సర్సాల గ్రామానికి తీసుకువెళ్తుంది. ఇక్కడేం జరిగిందో కూడా గుర్తుపట్ట లేనంతా నిజాన్ని అధికార బలాఢ్యులు పూర్తిగా రూపుమాపారు.

ఈ సీరీస్ రెండో భాగంలో, గిరిజనులను, దళితులను బెదిరించి, భూములను అధికారులు ఎలా లాక్కుంటున్నారో చెబుతున్నాం.

సర్సాల కే పరిమితం కాదు...

సర్సాలకు ఒక 35 కి.మీ దూరంలో మార్తండి అనే గ్రామం ఉంది. జూన్ 30 న మహిళా ఫారెస్టు అధికారి అనిత మీద దాడి జరగడంతో సర్సాల సంఘటనలు జాతీయ వార్తై పోయాయి. అయితే, మార్తండికి అంత భాగ్యం పట్టం లేదు. అక్కడ జరిగిన ఘటనలేవీ వార్తల కెక్కలేదు.

అయితే, సర్సాల ప్రతిధ్వని మార్తండిలో స్పష్టంగా వినిపిస్తుంది. ఇక్కడ కోలాం గిరిజనులు చిన్న చిన్న చెలకలలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. మరికొందరు పట్టాలున్న వెనకబడిన వర్గాల వాళ్లు, మాలలు కూడా ఇక్కడ ఈవూర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు. తేడా అనేది లేకుండా ఫారెస్టు శాఖ వాళ్ల వీళ్ల భూములన్నింటిని లాగేసుకున్నారు.

ఇది సర్సాల సంఘటనకు రెండు వారాల ముందు జరిగింది. జూన్ 18న, పెద్ద ఎత్తున ఫారెస్టు అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని ఉన్నట్లుండి మార్తండి మీద దండయాత్ర జరిపారు. భూముల్లోంచి అందరిని తరిమేశారు.

ఇలా భూమి పోగొట్టుకున్నవారిలో ఆత్రం భువనేశ్వరి (35) ఒకరు. ఆమె కుటుంబం మూడు దశాబ్దాలుగా అక్కడ నాలుగు ఎకరాలలో పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంది. తనదగ్గిర ప్రభుత్వం ఇచ్చిన హక్కు ప్రతం కూడా ఉందని, అదిభూమిని కాపాడలేకపోయిందని ఆమె వాపోతుంది.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

‘వాళ్లొచ్చి వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటతామన్నారు. మేమక్కడ బైఠాయించాం. ఈ భూములు మావి, వీటిలో మొక్కలెలా నాటుతారని నిలదీశాం. అయితే, సెక్షన్ ఆఫసీర్ మమ్మల్నందరిని కొట్టి అక్కడి నుంచి లాగి పడేశాడు,’ అని భువనేశ్వరి చెప్పింది.

మార్తండిలో మొత్తం 250 ఎకరాల పోడు వ్యవసాయం ఉంది. సర్సాలలోలాగా పత్తి కాకుండా ఈ వూరి ప్రజలకు కేవలం ఆహారాన్ని మాత్రమే పండించుకుంటారు. తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు వాళ్లు పండించేవారు. తమ భూముల్లో పంటలు పండించుకుంటూ ప్రజలు స్వతంత్రంగా జీవిస్తున్నందున ఈ గ్రామం స్వయం సమృద్ధిగా ఉంది. ఇపుడు వీళ్ల భూముల్ని లాగేసుకున్నారు. వీళ్ల జీవనాధారం పోయింది. ముందు ముందు ఎలా బతకాలో వాళ్లకు అంతుబట్టడం లేదు. బతికేవాళ్లకి భద్రత కల్పించాలిగాని, నోటికాడి కూడుతీసేస్తే ఎలా?

‘‘ మా భూమి నమ్ముకునే ఇన్నాళ్లు ఒకరిమీద ఆధారపడకుండా బతకుతూ వచ్చాం,’’ అని మాడా విజయ (48)తన జీవితం గురించి చెప్పింది. ఆమెకు నాలుగున్నర ఎకరాల భూమి ఉండింది. ‘‘ అమ్ముకునేందుకు మేం పంటలేయడం లేదు. మేం పత్తి పండించడం లేదు. కేవలం మా తిండి గింజలను మాత్రమే పండించుకుంటాం,’’ అని ఆమె చెప్పింది.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

దుర్రెం రాజ్ భాయి(37)కు సర్సాలలో గిరిజనులకు ఏంజరిగిందో బాగా తెలుసు. ‘‘ సర్సాలలో మాదిరి మేం ఎవ్వరిని కొట్టలేదు.కొట్టిఉంటే మేమూ జైల్లో పడివుండేవాళ్లం,’’ అని అమె చెప్పింది.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

‘‘ మమ్మల్ని కొట్టిన ఫారెస్టు అధికారుల మీద కేసు వేసేందుకు మేం పోలీస్ స్టేషన్ కు వెళ్లాం. పోలీసులు మా కంప్లయింట్ తీసుకోలేదు. మేం రైతులం కదమ్మా, మమ్మల్ని కొట్టినా, చంపినా కేసులుండవు,’’ అని ఆమె బాధపడుతుంది.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవసాయానికి మద్దతు అంటూ ప్రకటించిన ‘రైతు బంధు’ పథకం కింద ఏకరానికి ఎనిమిది వేల రుపాయల సాయం ఈ వూర్లో చాలా మంది ప్రజలకు అందింది.

‘‘వాళ్లు ఎకరానికి నాలుగువేలు ఖరీఫ్ లో నాలుగు వేలు రబీ లో ఇచ్చే వారు. అయితే, ఈసారి ఆపే శారు,’ అని మాడ విజయ చెప్పింది.

తమకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పి, తమ భూములను వెనక్కు ఇప్పించాలని కోరేందుకు మద్సు సంపత్ (22) అనే యువకుడు మరికొంతమందిని వెంటేసుకుని ఐటిడిఎ (ఇంటెగ్రేటెడ్ ట్రైబల్ డెవెలప్ మంట్ ఏజన్సీ)అధికారిని కలిశారు.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

ఇది తనకు సంబంధం లేని వ్యవహారమని, ఇలాంటి విషయాలను తనకు చెప్పవద్దని ఐటిడిఎ అధికారి చేతులెత్తేశాడని సంపత్ చెప్పాడు

ఇంత సులభంగా తమకు జీవనాధారమయిన భూములను ప్రభుత్వం లాక్కోవడమేమిటో మార్తండి ప్రజలకు అర్థంకావడం లేదు వారంతా చాలా ఆగ్రహంతో ఉన్నారు.

రాధండి శంకర్ (60), ఆత్రమ్ పోశయ్య (65)లతో మాట్లాడితే తెలుస్తుంది పల్లెలో ఎంత ఆగ్రహం ఉందో. పోశయ్యకు సరిగ్గా నిలబడే శక్తి కూడా లేదు. కర్ర ఊతం లేకుండా నడవనూ లేరు. అయినా సరే తమ కుటుంబాలకు జరిగిన అన్యాయం గురించి ఆక్రోశంతో వూగిపోతున్నాడు.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

‘‘ ఈ భూముల మీద హక్కుల కోసం, నేను 24 సంవత్సరాలున్నపుడు, ఎంతపోరాటం చేశానో,’ శంకర్ గతం నెమరేసుకుని, ఇపుడు జరిగింది చెప్పి బాధపడ్తాడు.

‘‘ఇదిగో ఈ పోశయ్య , బాగా వయసులో ఉన్నపుడు, నాకంటే ముందే భూమి హక్కులకోసం పోరాడాడు.ఇలా హక్కుల కోసం పొరాడటం మాకు కొత్త కాదు. ఈ సారి పోరాడతాం,’’ అని శంకర్ ధీమా వ్యక్తం చేస్తాడు.

బెజ్జూర్, కౌటాల పోరాట చరిత్ర

రాధండి రాజయ్య చెబుతున్న పోరాటమేమిటనుకుంటున్నారు, అది 1960,70 లలో నక్సలైట్లతో కలసి భూమి కోసం భుక్తి కోసం గిరిజనులు జరిపిన పోరాటమే.

మార్తండి, కొమరం భీమ్ జిల్లా బెజ్జూర్ మండల్ లోని ఒక పల్లె. ఈ మండలం మహారాష్ట్ర, చత్తీష్ గడ్ లతో త్రిభుజ సంబంధంతో ఉంటుంది. ఇదంతా దండకారణ్యంలో భాగం.

1960 నుంచి కూడా బెజ్జూర్ పరిసరాలు నక్సల్ కేంద్రాలు. ఇక్కడి గిరిజనుల నుంచి వారికి బాగా మద్దతు సానుభూతి ఉండింది.

బెజ్జూర్ కు 13 కి.మీ సమీపంలో ఉన్న సామిని అనే వూరు భారతదేశంలో మొట్టమొదటి నక్సల్ కోట అని స్థానికులు చెప్పారు. 1970 దశాబ్దం మధ్యన నక్సల్స్ కు మద్దతునిస్తున్న వారిని కనుగొనేందుకు వూరి మీద పెద్ద ఎత్తు పోలీసులు దాడి చేసి అణచివేత ప్రారంభించారని, దానితో గిరిజనులు నక్సల్స్ కు మద్దతుగా తిరగబడ్డారని ఇక్కడి వాళ్లు చెబుతారు.

అడవుల్లో తలదాచుకున్న నక్సల్స్ కు సామిని గ్రామ ప్రజలు తమ గోడు వినిపించారు. అపుడు పోలీసులు వూర్లోకి రాకుండా నక్సల్స్ గ్రామం దగ్గిర ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు.

ఇక్కడికి దగ్గరలోని కౌటాలలో కూడా చెక్ పోస్టు ఉండిందని వారు గుర్తు చేశారు. మహారాష్ట్ర గచ్చిరోలి అడవికి దగ్గరలో ఉన్న ఈ చెక్ పోస్టు 1990 దశాబ్దం దాకా పనిచేసిందని చెబుతారు. పోలీసుల నుంచి భద్రత కల్పించినందుకు మావోయిస్టులు గిరిజనుల నుంచి నక్సలైట్లు టాక్స్ వసులు చేసే వారు.

తమ భూమి, గుర్తింపు ,హక్కుల కోసం ఎలా ఉద్యమించాలో చత్తీష్ గడ్ గిరిజనులకు నేర్పించింది ఆంధ్రానక్సలైట్లే(ఇపుడు మావోయిస్టులు).

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పోలీసులు సామదాన ధండోపాయాలు ప్రయోగించి గ్రామస్థుల్లో చొరబడి, డబ్బు , కానుకలు ఆశ చూపి వారిలో కొంతమందిని తన గూడఛారులు మార్చుకోవడంలో విజయవంతమయ్యారు.

తర్వాత క్రమంగా ఎక్కువ మంది పోలీసులతో ప్రభావితం కావడం మొదలయింది.పోలీసులు కూడా గ్రామాలలో, అడవిలో చిన్నచిన్న చెక్ పోస్టు లను ఏర్పాటు చేశారు.

ఇదే సమయంలో ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం పలుచబడుతూ వచ్చింది. కొందరు ఫారెస్టులోకి పారిపోయారు, జబ్బు పడి చనిపోయారు. కొంతమంది సరెండర్ అయారు. మరికొందరిని పోలీసులు, సిఆర్ పిఎఫ్ వాళ్లు ఎన్ కౌంటర్లలో చంపేశారు.

పోలీసుల భయం ఉన్నా ఇక్కడి గ్రామాలలో ప్రజలు నక్సలైట్ల గురించి మాట్లాడటంమాన లేదు. కాకపోతే అంతా గుసగుసల్లాగే ఉంటుంది. మావోయిస్టులుండి ఉంటే పరిస్థితులు ఇలా దాపురించి ఉండేవికావని ఇప్పటి బాధితులందరిలో ఏకాభిప్రాయం ఉంది.

‘‘ ముఖ్యంగా, మా వూర్లో ఇంత అన్యాయం జరగడమేమిటి? మాకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మా భూములను లాగేసుకోవడం లాంటివి చూస్తే మావోయిజం మళ్లీవచ్చే రోజులొచ్చాయేమో ననిపిస్తుంది. ఇపుడు జరుగుతున్నది చూసి మా పిలగాళ్లంతా చాలా ఆక్రోశంతో ఉన్నారు.ఎదురుతిరగాల్సిన పరిస్థితులొచ్చాయి. అంతెందుకు కుర్రవాడిగా ఉన్నపుడు తుపాకి భుజానేసుకుని నేను కూడా మావోయిస్టులతో మార్చ్ చేసిన వాన్ణే,’ అని ఆయన చెప్పాడు.

ఇలాంటి భావం ఈ ప్రాంతమంతా ఒకేలా కనిపిస్తుంది. పట్టుకోల్పోయినప్పటికీ బెజ్జూర్, కౌటాలా ప్రాంతంలో మావోయిస్టులు ఇంకా సంచరిస్తున్నారని స్థానికులు చెప్పారు.

మావోయిస్టులు అడవుల నుంచి గ్రామాలకు వచ్చి, విశ్రాంతి తీసుకుని, తమకు కావలసిన సరుకులుకొనుక్కుని వెళ్లిపోతుంటారు. అంతకు మంచి ఏమీ చేయరని ఒక గ్రామస్థుడు చెప్పారు.

గ్రామస్థులు చెప్పిందాన్ని బట్టి చూస్తు మావోయిస్టులంటే ఇక్కడ ఇంకా సానుభూతి ఉందనిస్పష్టంగా తెలుస్తుంది.

‘‘ ప్రభుత్వమే మా భూములను తీసుకుంటూ ఉంటే, మా పద్ధతిలో మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఏం చేయాలో చెప్పండి? పోరాడేందుకు భయపడేవాళ్లం కాదు. గతంలో పోరాటం చేసిన అనుభవం ఉంది మాకు,’ అని ఆయన చెప్పాడు.

ఇటీవల అంటే 2016లో, గూడెం- అహేరి మధ్య ప్రాణహిత నది మీద తెలంగాణ ప్రభుత్వం వంతెన కట్టకుండా అడ్డుకునేందుకు మావోయిస్టులు ఒక ట్రాక్టర్ కు, ఒక్క ప్రొక్లెయినర్ కు, కొన్ని నిర్మాణప్పనులకు ఉపయోగించే యంత్రాలకు నిప్పంటించారని ఇక్కడి ప్రజలు చెప్పారు.

రూల్సెవరూ పట్టించుకోరు

ఇపుడు తెలంగాణాలో కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ దాడులనుంచి గిరిజనుల, పేదల హక్కులను కాపాడేందుకు ఈ ఏడాది మార్చి ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఎన్జీవో సమత, మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ వేసిన ఒక పిల్ కు స్పందిస్తూ కోర్టు పెసా (PESA) చట్టాన్ని (Panchayat (Extension to the Scheduled Areas)Act, 1996) సమర్థించింది.

పెసా చట్టం ప్రకారం ఎవైనా సాంఘికాభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలలో అమలు చేయాలనుకుంటే ముందు వాటిని గ్రామసభల ముందుంచి చర్చించి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది.

‘ది లీడ్’ తిరిగిన ఏ గ్రామంలో కూడా గ్రామ సభను సమావేశపర్చలేదని తెలిసింది. పోలీసులను, అటవీ శాఖ సిబ్బందిని వందల సంఖ్యలో తీసుకువచ్చి బలవంతంగా ప్రజలను ఈడ్చి పడేసి భూములను అక్రమించుకోవడమే ఇక్కడ జరిగింది. నిజానికి మొక్కలు నాటేందుకు ఇంత దురాక్రమణ అసవరం లేదు.

మార్తండి గ్రామానికి దగ్గరలో డబ్బా అనే మరొక గ్రామం ఉంది.ఇక్కడ జనాభా 1700. ఇందులో మూడో వంతు షెడ్యూల్డ్ క్యాస్ట్ మాలలు. వీరంతా ఎపుడో దశాబ్దాల కిందట మహారాష్ట్ర నుంచి వలసవచ్చి డబ్బాలో స్థిరపడ్డారు.

తాము పసిపిల్లలుగా ఉన్నపుడొచ్చి ఈ వూర్లో స్థిరపడ్డామని రామ్ టెంకి తుకారం (60) చెబుతాడు. తుకారాంకున్న ఆరెకరాలను ఫారెస్టోళ్లు లాగేసుకున్నారు. ‘‘ఈ భూములను సాగుచేసుకునేందుకు ఆరోజుల్లో గ్రామస్థులు అంగీకరించారు.తరతరాలుగా ఈ భూములను సాగుచేసుకుంటున్నాం, ఇన్నాళ్లు మాకు తిండిపెట్టిన భూములను వాళ్లు లాక్కున్నా’’రని లబోదిబో మంటాడు తుకారం.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

డబ్బాలో కూడా రెవిన్యూ భూములకు, ఫారెస్టు భూములకు మార్కింగ్ లేదు. దళితులు సాగు చేసుకుంటున్న భూములు పట్టాదారుల భూముల మధ్య కూడా కనిపిస్తాయి.

‘ ఈ ఫారెస్టాఫీసర్లు మాదగ్గిర నుంచి ప్రతి సంవత్సరం డబ్బు తీసుకుంటున్నారు. అందుకే సాగుచేసుకోనిచ్చారు. గత 40 సంవత్సరాలుగా మమ్మల్నిలా సాగుచేసుకోనిస్తూనే ఉన్నారు. ఇపుడేమంయిందో ఏమో ఈ భూములన్నీ లాక్కున్నారు,’ అని తుకారం చెప్పాడు.

జూన్ మొదటి వారంలో నాలుగు బస్సుల నిండా పోలీసుల, సిఆర్ పి ఎప్ వాళ్లు వచ్చి డబ్బా గ్రామం మీద వాలి, ప్రజలెవరూ భూముల దగ్గరకు వెళ్లడానికి వీళ్లేదని చెప్పారని దుర్గం బాపు (70) తుకారం చెప్పిందానికి ఇంకా వివరాలందిస్తాడు. వచ్చిరాకముందే ఈ భూములన్నీ మావని, మేం తీసుకుంటున్నామని,ఇక్కడి నుంచి వెళ్లిపోండని దబాయించారని వారు చెప్పారు.

గిరిజనుల మీద, దళితుల మీద ఆదిలాబాద్ జిల్లా అంతటా దాడులే   (రెండో భాగం)

తాను బాపూ ఇద్దరు కలసి అధికారులను కలసి భూములు తీసుకోవద్దని కాళ్ల మీద పడి ప్రాధేయపడినట్లు చెప్పారు. ఈ వృద్ధాప్యంలో భూములుపోతే, తాము బతకడమెట్లా అని కాళ్లు పట్టుకున్నా అధికారులు కనికరం చూపలేదని తుకారం చెప్పాడు. ‘‘అంతేకాదు, ఫారెస్టు రేంజర్ , ఇతర అధికారుల కాళ్ల మీద కూడా పడ్డాం. అయితే, వాళ్లు బూటు కాళ్లతో కొట్టారు. లంజాకొడకా అని తిట్టారు. మేం పేదవాళ్లం, ఈ భూములు పోతే, బతక లేం, 35 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములివి అని బతిమాలం. తిట్లు తప్ప మాకేమీ మిగల్లేదు,’’ అని వారిద్దరు వాపోయారు.

ఇపుడు వారి కుటుంబాలకు జానెడు భూమి కూడామిగల్లేదు. వాళ్లకి చూపించేందుకు వాళ్లకి పట్టాలు కూడా లేవు.

దళితులందరికి భూములిస్తామనే హామీ ఇచ్చి 2014 కెసిఆర్ అధికారంలోకి వచ్చాడు. డబ్బాలో ఉన్న దళితకులు భూములు పంచడం జరగలేదు. ఉన్నభూములను కూడా లాక్కుంటున్నారు.

జూండీ దేవ్జీ ని ఈ పరిస్థితి కలచి వేస్తున్నది. ఆయనకు ఆరుగురు కూతుర్లున్నారు. భవిషత్తులో ఏంచేయాలో ఎలా బతకాలో ఆయన అర్థంకావడం లేదు.

ఆయనకు ఆరెకరాల పొలం ఉండింది. అందులో పత్తి, కంది వేసేవాడు. రు. 50 వేల నుంచి 60వేల దాకా పంటకోసం అప్పు చేశాడు. తమ భూములకు బ్యాంకులు అప్పులీయవు కాబట్టి వడ్డీ వ్యాపారులనుంచి అప్పు తీసుకున్నాడు. తన భూమి, దాంతోపాటే పంటంతా పోయిందని అప్పు మిగిలిందని ఆయన దుంఖిస్తున్నాడు.

కాళేశ్వరం ప్రాజక్టుకు కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అమలుచేయాలనుకుంటున్నపుడు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉందో అర్థంకావడంలేదని డబ్బా సర్పంచు కుమారుడు అబ్దుల్ మజార్ చెప్పాడు.

‘‘ కాళేశ్వరం ప్రాజక్టు నుంచి ఒక నియోజకవర్గానికి చుక్కనీరు రాదు. వైఎస్ ఆర్ హయాంలో ఎస్ టిలకు హక్కు ప్రతాలొచ్చాయి. ఎస్ సిలకు కూడా భూములిస్తే వాళ్లమానాన వాళ్లు బతుకుతారు. వీళ్లంతా దాదాపు 40 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములివి. నలభై యేళ్లుగా ఫారెస్టు డిపార్టమెంట్ వీళ్లకి ఎపుడూ అభ్యంతరం చెప్పలేదు. ఇపుడు ఉన్న ట్లుండి ఈ భూములను లాక్కోవడంతో ముప్పై నలభై కుటుంబాలు బజారున పడ్డాయి,’ అని మజార్ విచారం వ్యక్తం చేశారు.

‘‘ మొన్న ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ ఒక హామీ ఇచ్చారు. రెండో సారి ముఖ్యమంత్రి అవుతూనే తాను స్వయంగా సిర్పుర్ కు వచ్చి,క్యాంప్ వేసి, ఇక్కడే కూర్చుని రైతులందరికి హక్కు పత్రం అందిస్తానని చెప్పాడు . అలాంటిముఖ్యమంత్రే ఇపుడు రాత్రికిరాత్రి భూములను లాక్కంటున్నాడు,’ అని మజార్ ఆరోపిస్తున్నాడు.

షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రడిషనల్ ఫారెస్టు డ్వెల్లర్స్ (రికగ్నిషన్ ఆప్ ఫారెస్ట్ రైట్స్) యాక్ట్ 2006 డిసెంబర్ 29 నుంచి అమలులోకి వచ్చింది.

అంతకు ముందు తరతరాలుగా అడవుల్లో నివసిస్తూ వచ్చిన గిరిజనులను ఆక్రమణ దారులు గా చూసే వారు. ఈ చట్టం వారిని అటవీ సంరక్షులుగా చూసేలా చేసింది.

ఈ చట్టం ప్రకారం అడవుల్లో నివసించే ఎస్ టీలు అడవీ వుత్పత్తులను సేకరించుకోవచ్చు, తామున్న చోట వ్యవసాయం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇతర సంప్రదాయక అటవీ ప్రజల హక్కులను కూడా ఈ చట్టం కాపాడుతుంది. అడవుల్లో నివసించే ఇతరులు అనే మాటకు ఈ చట్టం చాలా స్పష్టం నిర్వచనం చెప్పంది. దీని ప్రకారం,‘‘ ఎవరైనా వ్యక్తి లేదా జన సమూహం, 2005 డిసెంబర్ 13 కు ముందు మూడుతరాలుగా అడవిలో నివసిస్తూ ఉండి, అడవి మీద ఆధారపడి ధృవీకరించిన జీవితావసరాలను తీర్చుకుంటూ ఉంటే వాళ్లు ఫారెస్టు డ్వెల్లర్స్’’ అవుతారు.

డబ్బా గ్రామంలోని షెడ్యూల్డ్ క్యాస్ మాలలంతా ఈ నిర్వచనం కింద అటవీపుత్రులే అవుతారు.

ఈ సమస్యలను తాను నాయకత్వం దృష్టికి తీసుకువెళతానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప ‘ది లీడ్’ కు చెప్పారు.

‘‘ నా నియోజకవర్గంలోని ట్రైబల్స్ కష్టాల్లో ఉన్నారు. వాళ్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతాను. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తారని నాకు నమ్మకం ఉంది,’ అని కోణప్ప చెప్పారు.

‘ది లీడ్’ తో హైదరాబాద్ నుంచి అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ఫోన్ లో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని, అసలు ఈ సమస్య గురించి తనకు తెలియనే తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ విషయం మీద విచారణేమయిన చేయిస్తారా అని అడిగితే, తనకావిషయమే తెలియదని అన్నారు.

మొత్తానికిమొక్కలు నాటేందుకు ప్రజలు భూములు లాక్కోవడంతో కొమరం భీమ్ జిల్లాలో అశాంతి ప్రబలుతూ ఉంది. భూమి, బతుకు దెరువు,సామాజిక హోదా అనేవి ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి. ఏఒక్కటి పోయినా మిగతావన్నీ పోతాయి.

భూమి పోగొట్టుకొంటున్న గిరిజనుల్లో, దళితుల్లో అసహనం బాగా పెరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తుందీ జిల్లాలో.

The Lede
www.thelede.in