ఎలక్టోరల్ బాండ్స్ : గుప్తనిధులకు ఆశపడి ఆర్ బిఐని తోక్కేసిన మోదీ సర్కార్

ఎలక్టోరల్ బాండ్స్ : గుప్తనిధులకు ఆశపడి ఆర్ బిఐని తోక్కేసిన మోదీ సర్కార్

ఎలక్టోరల్ బాండ్లు రాజకీయాల్లోకి గుప్తనిధులను వరదలా తెస్తాయని RBI చేసిన హెచ్చరికను మోదీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు

ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం RBI అభిప్రాయాన్ని తోసిపుచ్చిం ది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి.

RBI అభ్యంతరాలను తోసిపుచ్చడం మీద ప్రభుత్వం చూపిన అనవసరమైన తొందర వల్ల అవెంత ఎంత సీరియస్ వో అనే అభిప్రాయాన్ని కల్పించాయి. ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్లలోని వివరాలు తెలుపుతాయి.

2018 మార్చినుండి ఇప్పటివరకు ఆరువేల కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అమ్ముడయ్యాయి. మొదటి విడతలో 222 కోట్ల రూపాయల బాండ్లు అమ్ముడయ్యాయి. వీటిల్లో 95శాతం డబ్బులు బీజేపీ రాబట్టుకుందని అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ సేకరించిన సమాచారంలో తెలిసింది.

ఆర్థిక శాఖమంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏదో తేడా ఉందని ఓ సీనియర్ టాక్స్ అధికారి 2017లో బడ్జెట్ డేకు నాలుగురోజుల ముందటి శనివారం నాడే కనిపెట్టాడు.

వివాదాస్పదమైన ఈ అంశం..కార్పొరేషన్లు,మిగతా సంస్థలు రాజకీయపార్టీలకు అదుపులేని డబ్బును ఈజీగా సరఫరా చేసే రాజమార్గంగా చట్టబద్దత తీసుకోబోతోంది. 2017 ఫిబ్రవరి 1 న ఇచ్చే ఉపన్యాసంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ను ప్రకటించడానికి సన్నద్ధం అవుతున్నాడు.

ఎలక్టోరల్ బాండ్స్ ను చట్టం గనక చేస్తే...పెద్ద వ్యాపారులు తమ దగ్గరున్న అజ్ఞాత ధనాన్ని పాలిటిక్స్ లోకి ప్రవహింపచేయడానికి చట్టబద్దత వచ్చినట్టే అవుతుంది.

ఇందులో ఒక మెలిక ఉంది...RBIని కూడా దార్లోకి తెచ్చుకోవాలి.

ఈ అజ్ఞాత విరాళాలకు చట్టబద్ధత కల్పించాలంటే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో సవరణలు చేయాలి. ఇదే విషయాన్ని ఓ టాక్స్ అధికారి ఆర్థిక శాఖలోని పై అధికారులకు 2017, జనవరి 28 న రాసిన నివేదికలో తేలిపాడు. ఆ సవరణలను డ్రాఫ్ట్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపాడు.

అదే రోజు మధ్యాహ్నం 1.45 నిముషాలకు ఆర్థికమంత్రిత్వశాఖలోని ఓ అధికారి ఇవేమీ పట్టించుకోకుండా ఓ ఐదు లైన్ల ఈ మెయిల్ రాశాడు. ఈ సవరణల మీద ముందుగా అభిప్రాయాలు చెప్పాల్సిందిగా అప్పటి RBI డిప్యూటీ గవర్నర్ రామసుబ్రహ్మమణియమ్ గాంధీకి, (బ్యాంక్ లో గవర్నర్ గా సుర్జీత్ పటేల్ ఆయనే నెంబర్ 2)కు మెయిల్ పెట్టారు.

2017, జనవరి 30 సోమవారం నాడు RBI తన వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేస్తూ రిప్లై ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్, RBI చట్టంలో సవరణలు చేయడం వల్ల మనీ లాండరింగ్ ను ప్రోత్సహించినట్టు అవుతుందని, భారతీయ బ్యాంకుల నోట్ల మీద నమ్మకం సన్నగిల్లుతుందని, సెంట్రల్ బ్యాంకింగ్ చట్టసూత్రాలను ఇది చెరిపేస్తుందని RBI తెలిపింది.

సమర్థవంతమైన బేరర్ బాండ్లుగా రూపాంతరం చెందే ఈ ఎలక్టోరల్ బాండ్స్..వీటి యజమాని ఎవరో తెలియకుండానే డబ్బులు చెలామణీ అయ్యే ఓ సంచలనాత్మక, అపారదర్శకమైన ఆర్థిక ఆయుధంగా మారుతాయని RBI చెప్పింది.

ఈ బేరర్ ఇనుస్ట్రుమెంట్స్ డబ్బులుగా మారే శక్తిని కలిగి ఉంటాయి. అయితే వీటిని అధిక మొత్తంలో కనుక జారీ చేస్తే RBI బ్యాంకునోట్స్ మీద ప్రజలకుండే నమ్మకాన్ని కోల్పోతాం అని బ్యాంకు రాసింది. ఇవి బేరర్ బాండ్లే కానీ డెలివరీ ద్వారా బదిలీ చేయవచ్చు. ఇవి చివరికి రాజకీయ పార్టీలకు ఎలా ఉపయోగపడుతాయో అందరికీ తెలిసిందే అని కూడా అన్నది.

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా చట్ట సవరణలు చేయాలంటే ఆయా మంత్రిత్వ శాఖలు, సంబంధిత ప్రభుత్వ అధికారులతో అధికారిక సంప్రదింపులు జరపాలి. ఈ చట్ట సవరణల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో చర్చించాలి. RBI ఇంత గట్టిగా వ్యతిరేకించిన తరువాత ఈ విషయంలో ఇక ఎలాంటి నిర్ణయానికీ తావుండకూడదు.

కానీ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో మోడీ ప్రభుత్వంలోని పై స్థాయి అధికారులు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు.

అప్పడు రెవెన్యూ సెక్రటరీగా ఉన్న హస్ ముఖ్ అధియా RBI ఆందోళనలను, క్లుప్తంగా, సంక్షిప్తంగా కొట్టివేశాడు. అదే రోజు సెంట్రల్ బ్యాంకునుండి పెద్దగా ఆందోళన పడే విషయాలు కాదంటూ ఓ సింగిల్ పేరాగ్రాఫ్ లెటర్ ఆర్థిక శాఖకు అందింది.

‘పన్ను చెల్లించిన ధనంలోనుండే ఈ బాండ్స్ ను దానం చేయాల్సి ఉంటుందని, పన్ను చెల్లించిన డబ్బులోనుండి బాండ్లు ఇచ్చినప్పుడు దాతపేరు రహస్యంగా ఉంచడంలో అభ్యంతరం లేదనే విషయాన్ని RBI సరిగా అర్థం చేసుకున్నట్టు లేదని నాకు అనిపిస్తుంది,’ అంటూ ఆర్థికవ్యవహారాల శాఖ సెక్రటరీ తపన్ రాయ్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి అధియా రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు.

RBI సూచనల్ని సరైనవి కావు అని నిరూపించే వాదనలతో కాకుండా ప్రభుత్వం RBI సూచనల్ని ఎప్పుడూ అంత సీరియస్ గా తీసుకోలేదు అనే విషయాన్ని అధియా నోట్ బయటపెడుతుంది.

ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో స్పందించాల్సిందిగా RBIని అడిగిన మొదటి పనిదినంలోనే తన సూచనలు చెప్పినప్పటికీ అధియా తన ఉత్తరంలో ‘ఇప్పటికే బిల్లు సిద్ధం అయిపోయింది. RBI సూచనలు రావడం ఆలస్యం అయ్యింది కాబట్టి...మనం ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారమే ముందుకు పోవచ్చు’ అంటూ ప్రస్తావించారు.

అదేరోజు అధియా సహోద్యోగి తపన్ రాయ్ అధియాతో ఏకీభవించాడు. అంతే ఆ ఫైల్ కాంతివేగంతో దూసుకుపోయింది. తక్షణమే ఆర్థికమంత్రి జైట్లీ సంతకం కూడా చేసేశాడు.

ఇది జరిగిన రెండు రోజులు తరువాత అంటే 2017 ఫిబ్రవరి 1 నాడు ఆర్థిక మంత్రి జైట్లీ ఎలక్టోరల్ బాండ్లను ప్రతిపాదించాడు. అంతేకాదు RBI చట్టంతో సవరణలు చేయాలని సూచించాడు. దీనివల్ల భారతదేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే ఫండ్స్ ను పారదర్శకంగా ఉంచడానికే ఈ బాండ్లు ఉపయోగపడతాయి చెప్పాడు. ఆ తరువాతి నెల జైట్లీ ప్రతిపాదన 2017 ఫైనాన్స్ బిల్లు ప్రకరణలో చట్టరూపం దాల్చింది.

ఇదెలా ఉందంటే RBI చట్టాన్ని, సవరణలను ఉల్లఘించకుండా వాళ్లను సంప్రదించినట్టుగానే పైకి కనిపిస్తూ భారతీయ రాజకీయ పార్టీలకు ముఖ్యంగా భారతీయజనతాపార్టీకి లాభం చేకూర్చేలా, కాకతాళీయంగా జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఏ వ్యాపార సంస్థ అయినా రాజకీయపార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే ఆయా సంస్థల వార్షిక లెక్కల స్టేట్మెంట్లు ముందుగా చూపించాలి. వారి మూడేళ్ల వార్షిక ఆదాయ యావరేజ్ మీద 7.5శాతం కంటే ఎక్కువ విరాళంగా ఇవ్వకూడదు. ఇక విదేశీ సంస్థలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయపార్టీలకు విరాళాలు ఇవ్వడానికి వీల్లేదు.

అయితే బీజేపీ ప్రభుత్వం ఈ సవరణలన్నింటినీ మార్చి పారేసింది. భారతీయ వ్యాపారసంస్థలు, ఎలాంటి వ్యాపారలావాదేవీలు జరగని షెల్ కంపెనీలు కూడా రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వచ్చు. వ్యక్తులు, ట్రస్టుల లాంటి చట్టపరమైన పరిధిలో ఉండేవి కూడా అజ్ఞాతంగా ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనవచ్చు...వాటిని డబ్బుగా మార్చుకోవడానికి నిశ్శబ్దంగా రాజకీయపార్టీలకు ఇవ్వచ్చు. అంతేకాదు విదేశీ సంస్థలు కూడా రాజకీయపార్టీలకు దారాళంగా విరాళాలు ఇవ్వచ్చు.

RBI సూచనలు రావడం ఆలస్యం అయ్యింది కాబట్టి...మనం ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారమే ముందుకు పోవచ్చు’ అంటూ ప్రస్తావించారు: హన్స్ ముఖ్ ఆర్ బి ఐ లేఖ మీద

మోడీ ప్రభుత్వం RBI ని ఎలా పక్కదారి పట్టించిందో, దాని సూచనలను ఎలా పట్టించుకోలేదో..RBI ని కాదని నిర్ణయాలు ఎలా తీసుకుందో పారదర్శకత కార్యకర్త, కమ్మోడర్ లోకేష్ బాత్ర (రిటైర్డ్) ఈ స్కీం కాలపరిమితి, దానిలోని లోపాలను గురించి డాక్యుమెంట్లు తయారు చేసి లోకానికి తెలియజేశారు. దీంతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకే పెద్దదిక్కైన RBI ఎలా అపహాస్యం అయ్యిందో సుప్రీంకోర్టు గుర్తించింది. అంతేకాదు దీంతో మోడీ ప్రభుత్వం భారతీయ సంస్థలతో సహా విదేశీ సంస్థలూ తమ ఆదాయాన్నిఅజ్ఞాతమార్గాల ద్వారా రాజకీయపార్టీల వేపు మల్లించే చట్టపరమైన మార్గాలకు తెరతీసిందని గుర్తించింది.

ఈ పథకం మీద మొదట్లో RBI చేసిన అభ్యంతరాలను పట్టించుకోకపోవడమే కాకుండా, ఈ పథకం ద్వారా ఎక్కువ హాని కలగకుండా, మోసాలు జరగకుండా, భారతీయ కరెన్సీ విలువ తగ్గకుండా ఉండేలా చూడమని మిగతా బ్యాంకులు చేసిన సూచనలను కూడా పట్టించుకోలేదు.

వచ్చే సంవత్సరపు యూనియన్ బడ్జెట్ తయారుచేసే పనిలో బిజీగా ఉన్నందున హాఫ్ పోస్ట్ ఇండియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే తీరిక లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం ‘మంచి ఉద్దేశ్యం’తో తీసుకున్నదే అని తెలిపింది.

ఈ ఈమెయిల్ లో గౌరవనీయమైన, సమర్థులైన అధికారులతో తీసుకోబడిన పాలసీ నిర్ణయాలమీద సందేహాలు ఉన్నాయని చెప్పింది. ఈ సందర్బంగా ఒకటి గుర్తుచేస్తున్నామని ప్రభుత్వ సంస్థలు తీసుకునే ఏ నిర్ణయమైనా ప్రజలందరికీ ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే తీసుకుంటుందని తెలిపారు. తీసుకున్న నిర్ణయాల మీద వివరణ ఇవ్వడం విభిన్న దృక్కోణాలను బట్టి ఉంటుందని అందుకే నిర్ణయం తీసుకునే సమయంలో జరిగిన అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

RBI ని పక్కదారి పట్టించడం

ఎలక్టోరల్ బాండ్స్, వాటి ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిపడే ఆదాయం విషయంలో ఇవి ఎలా పనిచేస్తాయో అనే అంశం ముందుగా అంతర్గతంగా అనేక చర్చలు జరిగిన తరువాతే లోక్ సభలో అత్యధిక మెజార్టీతో వీటికి చట్టబద్ధత కల్పించడం, ఎలాంటి ప్రశ్నలూ లేవనెత్తకుండానే రాజ్యసభలో బైపాస్ చేస్తూ జరిగిపోయింది.

ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో RBI సూచనలకు ప్రభుత్వం వివరణాత్మక ఖండనలను తయారుచేస్తున్న సమయంలోనే ఆర్థిక శాఖలోని అధికారులు అంతర్గతంగా ఎలక్టోరల్ బాండ్ల వల్ల రాజకీయపార్టీలకు జరిగే లాభాలను చెప్పే అంశాలను వివరాలను తయారుచేశారు.

రాజకీయ విరాళాల్లో పారదర్శకత ఉంటుందనే ప్రభుత్వ ఆలోచనకు విరుద్ధంగా జరిగితే ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని RBI అడిగిన ప్రశకు ‘ఎలక్టోరల్ బాండ్ల ముఖ్యోద్ధేశ్యమే దాత వివరాలను రహస్యంగా ఉంచడం’ అని సమాధానం ఇచ్చింది.

ఈ బాండ్లు ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని కాలరాస్తాయని బ్యాంకింగ్ వ్యవస్థనే దెబ్బతీస్తాయని RBI చేసిన హెచ్చరికలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఆర్థిక శాఖ కనీసం ఎలాంటి ఆర్థిక వాదన చేయడానికి కూడా ప్రయత్నించలేదు.

‘పార్లమెంటు అన్నింటికంటే గొప్పది. అన్ని అంశాలకు సంబంధించిన, అన్నిరకాల సవరణ నిర్ణయాలను...RBI చట్టంతో సహా తీసుకునే అధికారం దానికి ఉంది’ అని గుడ్డిగా చెప్పింది.

పార్లమెంటులో జైట్లీ ఎలక్టోరల్ బాండ్స్ ప్రవేశపెట్టిన నాలుగునెలల తరువాత అంటే 2017 జూన్ లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తపన్ రాయ్ కార్యాలయం ఓ లేఖ రాసింది. దాంట్లో ఎలక్టోరల్ బాండ్లు ఆచరణలో ఎలా పనిచేస్తున్నాయో వివరించింది.

ఎలక్టోరల్ బాండ్లు అమ్మే బ్యాంకులు కొనేవారివివరాలు, ఎవరికి ఇస్తున్నారో వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నాయన్న విసయాన్ని రాయ్ తన నోట్ లో ఒప్పుకున్నాడు. అంతేకాదు RTI చట్ట పరిధిలోకి కూడా ఈ విషయాలు రావని తెలిపాడు.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకు విరాళాలు ఇచ్చే సంస్థల వివరాలు, అడ్రస్ లు రాజకీయపార్టీలు రికార్డులు చూపించాల్సిన పనిలేదని ఈ నోట్ లో పేర్కొన్నారు.

ఎలక్టోరల్ బాండ్లను పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు జైట్లీ ఎలక్టోరల్ విరాళాల్లో పారదర్శకత అంటూ చేసిన ప్రసంగానికి బద్ధ వ్యతిరేకంగా ఉంది. తన ప్రసంగంలో జైట్లీ ఈ సంస్కరణ రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందని, భావితరాలను నల్ల ధనంనుండి రక్షిస్తుందని చెప్పారు.

దాత ఎవరో తెలియకుండా ఉండడం అనే అంశం విషయంలో ప్రజల్లో వచ్చే సందేహాలకు ప్రభుత్వం మరో రకంగా వివరణ ఇచ్చింది. రాజకీయపార్టీల దగ్గర వివరాలు లేకపోయినా బాండ్లు ఇష్యూ చేసిన బ్యాంకుల్లో వాళ్ల వివరాలు ఉంటాయి కాబట్టి అది అంత పెద్ద సమస్య కాదని తేల్చేసింది.

అంటే ఈ బాండ్లు ఎవరు ఇస్తున్నారు అనే విషయం కేవలం ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుందని అర్థం.

ఎలక్టోరల్ బాండ్లు ఎలా పనిచేస్తాయో ఆర్థికశాఖ నిర్ణయించిన తరువాత జైట్లీ నేతృత్వంలో 2017 జులై 19న ఓ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఎలక్టోరల్ బాండ్ల స్ట్రక్చర్ ను ఫైనలైజ్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి దీనికి భారతీయ ఎన్నికల సంఘం, RBI ని పిలిచారు. అయితే ఎలక్షన్ కమిషన్ అధికారులు వచ్చారు కానీ RBI ఈ సమావేశానికి గైర్హాజరయ్యింది.

దీని తరువాత 2017 జులై 28న RBI డిప్యూటీ గవర్నర్ B.P.కనుంగో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి S.C.గార్గ్ ను ప్రత్యేకంగా కలిశారు. తపన్ రాయ్ తరువాత S.C.గార్గ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నాడు. అదే రోజు RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎలక్టోరల్ బాండ్లమీద చర్చించడానికి ఆర్థికశాఖ మంత్రి జైట్లీని కలిశాడని ఆర్థిక మంత్రిత్వ శాఖ రికార్డులు చూపిస్తున్నాయి.

జైట్లీ, ఉర్జిత్ పటేల్ సమావేశాన్ని ఫాలో అప్ చేస్తూ ఆగస్టు లో RBI ఆర్థిక శాఖకు ఓ ఉత్తరం రాసింది. దాంట్లో కూడా ఈ స్కీంలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది.

ఈ బాండ్లను దుర్వినియోగం చేసే అవకాశాలు చాలా ఉన్నాయని, అవసరంలేని పనులకు వాడే అవకాశాలెక్కువగా ఉన్నాయని RBI డిప్యూటీ గవర్నర్ రాశారు. ఇలాంటి బేరర్ బాండ్లు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఆమోదం పొందలేదని కూడా తెలిపాడు.

ఓడిపోతున్న యుద్ధమని తెలిసినా ఈ బాండ్ల విలువను తగ్గించడానికి తద్వారా మోసాన్నీ, మనీ ల్యాండరింగ్ ను అరికట్టడానికి తనదైన చివరి ప్రయత్నం చేశారు.

అంతేకాదు బాండ్లు జారీ చేసిన 15 రోజులే వాటికి వాలిడిటీ ఉండాలని, బాండ్లు తీసుకునేవారి బ్యాంకు అకౌంట్లను మీ వినియోగదారుడిగురించి తెలుసుకో అనే అంశం కింద పూర్తిగా వెరిఫై చేసిన తరువాత బాండ్లు జారీ చేయాలని, సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే బాండ్లు జారీ చేయాలని, అది కూడా RBI ముంబై ఆఫీసులోనే జరగాలని RBI తన నోట్ లో కొన్ని సూచనలు చేసింది. దీనివల్ల బాండ్ల దుర్వినియోగాన్ని అరికట్టే ప్రయత్నం చేసింది.

చివరగా యేటా బ్యాంకులు జారీచేసే బాండ్ల పరిమితి మీద ఓ అదుపు ఉండాలని RBI కోరుకుంది.

ఎలక్టోరల్ బేరర్ బాండ్ల గొపదనాన్ని RBIఇప్పుడు అంగీకరిస్తుంది. DEA ప్రతిపాదనను విస్తృత అమరికలో ఒప్పుకుంటుంది అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఆర్థిక శాఖకు రాసిన ఒక నోట్ లో పేర్కొన్నారు. అంతేకాదు ఎలక్టోరల్ బాండ్ల కాలపరిమితిని 15 రోజులు మాత్రమే ఉండేలా చూడాలన్న RBI సూచనను మనం ఆమోదించాలని తెలిపారు.

సెంట్రల్ బ్యాంక్ చేసిన మిగతా సూచనలను పట్టించుకోలేదు. అలా బాండ్ స్కీం ఆవిష్కరించారు. ఏ భారతీయ పౌరుడైనా, కార్పొరేట్స్ అయినా, స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు ఎవరైనా సరే SBI బ్రాంచులనుండి బాండ్లు కొనవచ్చు. వాటిని రాజకీయపార్టీలకు రహస్యంగా దానం చేయవచ్చు.

ఒక అజ్ఞాత లేఖ

ఒకవైపు ఎలక్టోరల్ బాండ్ స్కీం మీద RBI వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొనకపోయినా, అసాధారణమైన మార్గాలనుంచిసలహాలను తీసుకుంది. ఇట్ల ఎవరో పంపిన కాన్సెప్ట్ పేపరొకటి RTI చట్టం ప్రకారం హాఫ్ పోస్ట్ ఇండియా తీసుకున్న డాక్యుమెంట్లతో పాటు దొరికింది.

లెటర్ హెడ్ లేని, ఖాళీ పేపర్లమీద, సంతకాలు, తేదీలు ఏమీ లేకుండా ఇది ఉంది. భారత అధికారులు తయారుచేసిన మమోలు ఇలా ఉండవు.

హాఫ్ పోస్ట్ ఇండియా ఈ నోట్ ను ఒక అధికారంలో ఉన్న, మరొక రిటైర్ అయిన IAS అధికారితో పంచుకుంది. అందులో ఒకరు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేస్తున్నవారైతే మరొకరు అలా పనిచేసి రిటైర్ అయినవారు. వీరిద్దరూ ఈ నోట్ లను చూసి ఇందులో వాడిన భాష అధికారులది కాదని చెప్పారు.

ఎలక్టోరల్ బాండ్ లను ఎలా మేనేజ్ చేయవచ్చు? అంటూ ఈ నోట్ మొదలవుతుంది. ఈ బేరర్ బాండ్ ఎవరు ఉపయోగించుకోవచ్చో వారిపేరు స్పష్టంగా ఉండదు. అంతేకాదు బాండ్ తీసుకునేవారి పేరూ తెలియదు. చేతులు మారుతూ వెళతాయి. దీనివల్ల ఎలాంటి జాడలూ మిగలవు.

అంతేకాదు ఒకేసమయంలో రెండు రకాల ఎలక్టోరల్ బాండ్లను నడిపించాలని నోట్ సూచిస్తోంది.

రెండువేల రూపాయల వరకు ఉండే బాండ్లు ఫిజికల్ బేరర్ బాండ్ రూపంలో ఉండాలని సూచించింది..అదే సమయంలో ఈ బాండ్ల వల్ల మనీల్యాండరింగ్ ప్రమాదం ఉందని కూడా ఒప్పుకుంది. రెండువేల పైబడి ఉండే బాండ్ల విషయంలో డిజిటల్ గా జనరేట్ అయినవి అయి ఉండాలని అవికూడా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా మేనేజ్ చేసేవయి ఉండాలని చెప్పింది. అయితే దీంట్లో కూడా మనీల్యాండరింగ్ అయ్యే అవకాశాలున్నాయని నోట్ లో చెప్పబడింది.

ఇది చదువుతుంటే గవర్నమెంట్ లో లేని వ్యక్తులెవరో దీన్ని రాసి కాన్సెప్ట నోట్ కింద ప్రభుత్వానికి సమర్పించినట్టుగా ఉందని ఈ లేఖను సమీక్షించిన రిటైర్డ్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఈ లేఖ రాసిన వారెవరో హాఫ్ పోస్ట్ ఇండియా కనిపెట్టలేకపోయింది.

చివరికి ప్రభుత్వం ఈ లేఖను తుంగలో తొక్కి ఇప్పుడున్న ఎలక్టోరల్ బాండ్ స్కీంను తెరమీదికి తెచ్చింది.

పైసా పాలిటిక్స్ సిరీస్ లో వస్తున్న మొదటి భాగం ఈ వ్యాసం. మోడీ ప్రభుత్వం కనిపించని ధనాన్ని ఎలా భారతరాజకీయాల్లోకి తీసుకువచ్చిందో చెప్పే హఫ్ పోస్ట్ ఇండియా చేసిన ఇన్వెస్టిగేషన్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్. (Link)

AD
No stories found.
The Lede
www.thelede.in